
అద్భుతమైన కథలని ఎన్నుకునే విజనరీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం’ ఎల్లమ్మ’ను రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లతో దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా కెమెరా ముందు అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని కూడా అందిస్తున్నాడు. ఎల్లమ్మ సినిమా దైవిక శక్తి నేపథ్యంగా, స్థానిక సంప్రదాయాలు, జానపద విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాన్ని బలంగా ప్రతిబింబించేలా రూపొందుతోంది. మకర సంక్రాంతి శుభ సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా మిస్టికల్‌ను వరల్డ్ అద్బుతంగా పరిచయం చేసింది. ఇందులో పొడవాటి జుట్టు, రగ్గడ్ లుక్‌లో దేవిశ్రీ ప్రసాద్ పాత్రలో పూర్తిగా లీనమై కనిపించారు. ‘ఎల్లమ్మ’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.