
మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ ప్రతిష్టాత్మక పాన్- ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ఎస్‌వైజి (సంబరాల యేటిగట్టు) నుంచి సంక్రాంతి సందర్భంగా అద్భుతమైన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన బ్యానర్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. పోస్టర్‌లో సాయి దుర్గతేజ్ రస్టిక్ అవతార్‌లో అదరగొట్టారు. బూడిద రంగు చొక్కా, సాంప్రదాయ పంచె కట్టు ధరించి, గ్రామీణ నేపథ్యంలో చెప్పులు లేకుండా నడుస్తూ, తెల్లటి ఎద్దును సున్నితంగా నడిపిస్తున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. గుబురు గడ్డం, తీక్షణమైన చూపు, చిరునవ్వు ఈ మూడు కలిసి ఆయన లుక్ అదిరిపోయింది.