
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోడి పందేలు అంగరంగా వైభవంగా జరుగతున్నాయి. కోడి పందేలతో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. కోడి కత్తితో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ళలో ఘటన జరిగింది. కోడి పందెం విషయంలో వివాదం తలెత్తింది. జగన్నాధం అనే వ్యక్తి కోడి పందెం గెలిచిన తర్వాత ఓడిన పుంజును తీసుకోవడంతో గొడవ చోటుచేసుకుంది. జగన్నాధంపై ఓ వ్యక్తి కోడి కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. జగన్నాధం మెడపై బలమైన గాయాలయ్యాయి. జగన్నాధాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.