Reading Time: < 1 minute

బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ’దురంధర్’ రణవీర్ సింగ్‌కి కమ్ బ్యాక్ మాత్రమే కాదు, అక్షయ్ ఖన్నాకి నటుడిగా అద్భుతమైన పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘దురంధర్ 2’ స్టోరీ లైన్‌ను ఫిల్మ్‌మేకర్స్ మార్చేస్తున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి రెండో పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మార్చి 19న ’దురంధర్ 2’ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు.. ఈ రీషూట్‌లో మరో సర్ ప్రైజ్ ఉన్నట్టుగా సమాచారం. మొదటి భాగంలో రెహ్మాన్ డకైత్ మరణిస్తాడు. కానీ రెహ్మాన్ డకైత్ ’దురంధర్ 2’లో తిరిగి వస్తాడట. ఈ నెల చివరి నుంచి అక్షయ్ ఖన్నా కు సంబంధించిన సీన్స్ ను రీ-షూట్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ పాత్రను తిరిగి ఎలా ప్రవేశపెడతారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. బహుశా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌తో ఆ క్యారెక్టర్ బ్యాక్‌స్టోరీని వివరించి, కథను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారేమోనని అనుకుంటున్నారు.