Reading Time: 2 minutes

 ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావును

ప్రశ్నిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

ఇంటరాగేషన్‌లో ఇంకా ఏం మిగిలిందని ప్రశ్న

తదుపరి విచారణ 10వ తేదీకి వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్ కేసులో ఇంకెంతకాలం విచారణ కొ నసాగిస్తారు, ఇంకా ఏమి మిగిలిందని సిట్ బృందంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ స్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని కూడా సు ప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్‌రావుకు ఇచ్చిన మ ధ్యంతర రక్షణను పొడిగించింది. ఈ సం దర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సం స్థను కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్ర భాకర్‌రావు ఇంటరాగేషన్‌పై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు  జారీ చేసింది.

ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేస్తూ, ఇంకెంత కాలం విచారణ కొనసా గిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది? అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభాకర్‌రావును ఇంటరాగేషన్‌ను చేయడానికి ఇప్పటికే అవకాశం ఇచ్చామని, దీనితోనైనా మీ పర్పస్ పూర్తయిందా? లేదా? ఆయన్ని మీరు జైల్లో పెట్టాలనుకుంటున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ప్రభాకర్‌రావును విచారణకు పిలవకుండా ఉండాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే ప్రభాకర్‌రావును మళ్లీ పిలిచి విచారించేందుకు కోర్టు అనుమతి ఇస్తుందని కూడా స్పష్టం చేసింది.

ఈ కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ప్రభా కర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా? లేదా? అన్నదే ప్రధాన ప్రశ్న అన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం ప్రభాకర్ రావును అరెస్టు చేయకుండా ఉన్న మధ్యంతర వెసులుబాటును తదుపరి విచారణ వరకు పొడిగించినట్టు కోర్టు వెల్లడించింది. అలాగే ఇంటరాగేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ.. ఈ కేసును మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు దర్యాప్తులో సాధించిన పురోగతిని కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.