
భోపాల్: ఓ కుటుంబ కారులో వెళ్తుండగా నీల్గాయ్ దూసుకొచ్చి ముందు సీట్లో కూర్చున్న పాపపై కాళ్లు పడడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గునా ప్రాంతానికి చెందిన సోనూ జాట్ అనే వ్యక్తి సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి తన సొంతూరుకు కారులో వెళ్తున్నాడు.బైపాస్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా రెండు నీల్గాయ్‌లు రోడ్డుపైకి దూసుకొచ్చాయి. ఒక నీల్గాయ్ ముందు సీట్లో కూర్చున్న అందాలను పగులగొట్టి పాప తాన్య తలపై కాళ్లు పడ్డాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. తన్యా తలకు బలమైన గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. కారు ముందు భాగంలో చిక్కుకున్న నీల్గాయ్ అటవీ శాఖ అధికారులు భయటకు తీసి చికిత్స అందించారు.