
అమరావతి: ఓ ఎస్‌ఐ కారు నడుపుతూ నిద్రలోకి జారుకోవడంతో బైక్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం ఎస్‌ఐ చౌడయ్య ఎడ్లపందేల, కోళ్ల పందేల బరుల వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సంక్రాంత్రి పండుత సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరుకు కారులో బయలు దేరాడు. పోతవరం వద్దకు రాగానే ఒక్కసారిగా నిద్రమత్తులోనికి జారుకున్నాడు. అదేసమయంలో ఉప్పమాగులూరుకు చెంది దండా వీరయ్య బైక్‌పై వెళ్తుండగా కారు వారిని ఢీకొట్టింది. వీరయ్య ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఎస్‌ఐ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ చౌడయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.