
రెబల్ స్టార్ ప్రభాస్… హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’స్పిరిట్’లో తన కెరీర్‌లోనే ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. మేకర్స్ న్యూ ఇయర్‌కి విడుదల చేసిన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మేకర్స్ ఇప్పుడు థియేటర్ రిలీజ్ డేట్‌ని ఖరారు చేశారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో స్పిరిట్ మార్చి 5, 2027న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో వుంది. స్పిరిట్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ మొత్తం 8 భాషల్లో యూనివర్సల్ గా రిలీజ్ కానుంది.