Reading Time: < 1 minute

హైదరాబాద్: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నా.. చాలా మంది ఆ విషయాన్ని పెడచెవిన పెడుతుంటారు. ముఖ్యంగా కొందరు మద్యం సేవించి ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. ఆ మత్తులో ఎంత దారుణానికైనా ఒడిగడతారు. అలాంటి దారుణమైన ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ కోసం అన్నను తమ్ముడు చంపిన ఘటన నాచారం పిఎస్ పరిధిలో జరిగింది. అర్థరాత్రి మద్యం తాగే క్రమంలో గ్లాస్ గురించి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో మూడంతస్తుల భవనం పైనుంచి అన్నను తమ్ముడు తోసేశాడు. ఇది గమనించిన స్థానికులు అన్నను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గమద్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.