Reading Time: < 1 minute

హైదరాబాద్: నాచారంలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి మద్యం తాగే క్రమంలో గ్లాస్ కోసం జరిగిన గొడవలో తమ్ముడు అన్నను చంపాడు. మూడంతస్తుల భవనం పై నుంచి అన్నను తోసేశాడు. వెంటనే స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. నాచారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.