Reading Time: < 1 minute

టీం ఇండియా రన్‌ మెషిన్ విరాట్ కోహ్లీ ఇటీవల ప్రకటించిన ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం తర్వాత విరాట్ మళ్లీ నెం.1 ర్యాంకులోకి వచ్చాడు. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఐసిసి ఓ తప్పిదం చేసింది. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కాక తప్పలేదు.

విరాట్ నెంబర్ 1 స్థానంలో 825 రోజులు ఉన్నట్లు ఐసిసి పేర్కొంది. కానీ, నిజానికి విరాట్ నెం.1 స్థానంలో ఉన్నది 1,547 రోజుల పాటు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ఐసిసిపై ఫైర్ అయ్యారు. అంత పెద్ద సంస్థ బాధ్యతారాహిత్యంగా తప్పుడు సమాచారంతో ఎలా పోస్ట్‌లు పెడుతుందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో ఐసిసి తప్పును సరిదిద్దుకొనే చర్యలు చేపట్టింది.

ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి.. విరాట్ నెం.1 ర్యాంక్‌లో 1,547 రోజులు కొనసాగాడంటూ పేర్కొంది. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 785 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 784 పాయింట్లతో ఉన్నాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.