
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు తెరలేచింది. గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్, మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని చూస్తుంటే, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని కసిగా ముందుకు సాగుతుంది. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో గత మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7: 30 గంటలకి ప్రారంభం కానుంది.
కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేయ్యండి:
* శుభ్‌మన్ గిల్ (GT): గత సీజన్‌లో 650 పరుగులతో అదరగొట్టాడు. ఈ సీజన్ అతనికి చాలా కీలకం కానుంది.
* శ్రేయస్ అయ్యర్ (PBKS): పంజాబ్ కింగ్స్ జట్టును ముందుండి నడిపించే భారం ఈ అనుభవజ్ఞుడిపైనే ఉంది. ఈసారి జట్టుకి కప్ అందించాలనే కసితో ఉన్నాడు.
* రషీద్ ఖాన్ (GT): గత సీజన్ లో నిరాశ పర్చినప్పటికీ, ఈసారి తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు.
* అర్ష్‌దీప్ సింగ్ (PBKS): పంజాబ్ జట్టు బౌలింగ్ విభాగానికి ఇతడే ప్రధాన అస్త్రం. ఆరంభంలోనే వికెట్లు తీసేలా ప్లాన్ చేస్తున్నాడు.
పిచ్ రిపోర్ట్:
* న్యూ ఛండీగఢ్ లోని పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలిస్తుంది. ఇక్కడ గతంలో భారీ స్కోర్లు (200+) నమోదయ్యాయి. అలాగే కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు కూడా పంజా విసిరారు. కాబట్టి బ్యాట్, బాల్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
ఎవరు గెలుస్తారంటే?:
* ప్రస్తుత ఫామ్ అండ్ బౌలింగ్ లైనప్‌ను బట్టి పంజాబ్ కింగ్స్‌కు గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సన్ జోడీ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ALSO READ : నన్నెవడ్రా ఆపేది.. ఈసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ అదిరిపోవాల్సిందే
తుది జట్లు
* పంజాబ్ జట్టు: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, కూపర్ కొన్నోలీ, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
* గుజరాత్ జట్టు: శుభ్‌మన్ గిల్, సాయి సుధర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రాహుల్ తేవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్