Reading Time: < 1 minute

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. అతడికి హనుమంతుడి పేర్లలో ఒకటైన ‘వాయువ్’ అని నామకరణం చేశారు. అయితే తాజాగా వరుణ్ తన కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుగుపుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వరుణ్, లావణ్య దంపతులు పంచుకున్నారు. ఈ ఫోటోల్లో వరుణ్ తల్లిదండ్రులతో పాటు సోదరి నిహారిక కూడా ఉంది. వాయువ్‌తో జరుపుకుంటున్న తొలి సంక్రాంత్రి ఇది అని.. ఈ వేడుక తమకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వరుణ్‌కి అతడి కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు.