Reading Time: < 1 minute

హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అయిన చెంగిచెర్లలో దొంగలు హల్‌చల్ చేశారు. గత రాత్రి కార్లలో వచ్చి పక్కా ప్లాన్‌తో కనకదుర్గ కాలనీ, అనుశక్తి నగర్లో తాళం వేసిన 12 ఇళ్లలో చోరీకి పాల్పడి పరార్ అయ్యారు. దుండగలు బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. చేతిలో కత్తులు పట్టుకుని పరిసరాల్లో కలిసి తిరిగారు. కాలనీ వాసులు తీవ్ర భయబ్రాంతులకు గురవ్వడంతో..  సమాచారం  అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.