
మలయాళం హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి. ఇప్పటివరకూ సౌత్‌లోనే సినిమాలు చేసినా.. ఈ భామకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం నార్త్‌లో కూడా ఉంది. దీంతో ఇప్పుడు సాయిపల్లవి బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా ‘ఏక్ దిన్’ అనే సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా పోస్టర్ విడుదల చేశారు.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ పోస్టర్ 2016లో వచ్చిన థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ను పోలి ఉందని.. మూవీని కాపీ చేశారంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పేరు దగ్గర నుంచి పోస్టర్ వరకూ అన్ని ఒకేలా ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు. ఈ సినిమా నిజంగా ‘వన్ డే’కు రీమేకా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని కూడా విడుదల చేశారు. అమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.
Some stories don’t need time 📷
Watch EK DIN only in theatres, 1st May 2026.#JunaidKhan #SaiPallaviDirected by: Sunil Pandey
Written by: Sneha Desai, Spandan Mishra
Produced by: Mansoor Khan, Aamir Khan, Aparna Purohit
Music: Ram Sampath
Lyrics: Irshad Kamil
Co-Producer: B.… pic.twitter.com/yuwgjTBUyy— Aamir Khan Productions (@AKPPL_Official) January 16, 2026