
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ “రొమాంటిక్ లవ్, సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాష్, -భైరవి జోడీ చాలా చక్కగా కుదిరింది”అని తెలిపారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ “ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నాం. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం” అని అన్నారు.