
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడిల మెగా బ్లాక్‌బస్టర్ ’మన శంకర వర ప్రసాద్ గారు’ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. అర్చన ఈ చిత్రాన్ని సమర్పించారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్‌బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్ యూ మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు, ఆయనని ఒక నటుడిగా అభిమానించే ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి ఈ సినిమాలో అడుగడుగునా ఒక మ్యాజిక్‌ని సృష్టించే అవకాశం నాకు కల్పించారు. వెంకటేష్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన కామియో రోల్ చేశారు. ఈ సంక్రాంతిని కూడా నాకు మరచిపోలేనిదిగా చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు”అని అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, హర్షవర్ధన్, అభినవ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.