
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా జిల్లా ప్రజలు దశాబ్దాల కళ, ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిలతో కలిసి భ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిఫ్యాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. భ్యారేజీ గేట్ల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి జూపెల్లి మాట్లాడుతూ సదర్మాట్ భ్యారేజీతో ఈ ప్రాంత రైతాంగ కళ సాకారం కాబోతుంది.
వేలాది ఎకరాలకు సాగునీరు అం దించే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో అత్యంత అట్టహాసంగా నిర్వహించాలి. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుం డా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ రంగానికి ఈ భ్యారేజీ వెన్నుముకగా నిలుస్తుందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్థు అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుం దాన్, ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.