Reading Time: < 1 minute

వాషింగ్టన్ : రష్యా, సొమాలియా, ఇరాన్ సహా 75దేశాలతో వీసా ప్రా సిసింగ్ ప్రక్రియను అమెరికా ఫ్రీజ్ చేసింది. ఈ మేరకు బుదవారం ట్రం ప్ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి వీసా దరఖాస్తుల పరిశీలన ఆగిపోతుంది.ప్రజా సంబంధిత అం శాలు ( పబ్లిక్ ఛార్జ్) పరిధిలో వీసాలపై ఆంక్షలు విధించారు. అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెలువరించిన మోమో ప్రకారం కాన్సులర్ ఆఫీసర్లు ఆయా దేశాల వీసాలను ఇప్పుడున్న చట్టాల పరిధిలో తిరస్కరించాల్సి ఉంటుంది. ఇకపై వీసాల దరఖాస్తుల స్క్రీనింగ్, వాటి ఆమోద ప్రక్రియను పునః పరిశీలిస్తుంది. వీసాల ప్రాసిసింగ్ నిలిపివేత దేశాలలో పాక్, బ్రెజిల్, ఈజిప్టు, నైజిరియా, ధాయ్‌లాండ్, యెమెన్ కూడా ఉం టాయి. నిలిపివేత ప్రక్రియ నిరవధికంగా నిలిపివేస్తారు. ఇమిగ్రేషన్ వీ సా ప్రాసిసింగ్ విధానం పున సమీక్ష నిర్వహణ ముగిసే వరకూ ఈ నిర్ణ యం అమలులో ఉంటుంది. అమెరికా విదేశాంగ శాఖ పేర్కొన్న పబ్లిక్ ఛార్జ్ అంశంలో పలు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, వయస్సు, ఇంగ్లీష్ ప్రావీణ్యత, ఆర్థిక పరిస్థితులు, దీర్ఘకాలిక వైద్య చికిత్సలకు అవసరం అయిన స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని వీసా ప్రాసిసింగ్‌లో కోతలు పెట్టారు. అయితే ఏ దేశాన్ని ఎందుకు వీసా నిరాకరణల జాబితాల్లో చేర్చింది వివరించలేదు.