
మన తెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం మరింత వే గవంతం చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ టికె శ్రీదేవి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా 10 కార్పొరేషన్‌లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి.మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించగా, బిసిలకు బిసి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లలో గ్రేటర్ హైదరాబాద్‌తో సహా కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యా ల, నల్గొండ, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లున్నాయి. వీటికి 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్‌లు ఖరారు చేయగా, బిసిలకు మాత్రం బిసి డెడికేటెడ్ కమిషన్ అందజేసిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే న్‌లో 300 వార్డులుండగా, ఇందులో ఎస్‌టిలకు 5 రిజర్వు చేయగా, 3 జనరల్, రెండు మహిళలకు కేటాయించారు.ఎస్‌టిలకు 23 రిజర్వు చేయగా ఇందులో 12 జనరల్, 11 మహిళలకు కేటాయించారు. బిసిలకు 122 రిజర్వు చేయగా, ఇందులో 61 జనరల్, 61 మహిళలకు కేటా ంచారు. అలాగే, కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 వార్డులుండగా ఎస్‌టిలకు 11,
ఎస్‌సిలకు 12, బిసిలకు 7 రిజర్వ్ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ 60 వార్డులుండగా ఎస్‌టిలకు 3, ఎస్‌సిలకు 7, బిసిలకు 20 స్థానాలు రిజర్వు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 వార్డులుం గా ఎస్‌టిలకు 2, ఎస్‌సిలకు 11, బిసిలకు 20 స్థానాలు రిజర్వు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 వార్డులుండగా, ఎస్‌టిలకు 1, ఎస్‌సిల 5, బిసిలకు 24 కేటాయించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 వార్డులుండగా ఎస్‌టిలకు 1, ఎస్‌సిలకు 7. బిసిలకు 25 కేటాయించారు. రామ ండం కార్పొరేషన్‌లో 60 వార్డులుండగా ఒకటి ఎస్‌టిలకు, 13 ఎస్‌సిలకు, 16 బిసిలకు కేటాయించారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 వార్డు ండగా, ఎస్‌టిలకు 1, ఎస్‌సిలకు 9, బిసిలకు 20 కేటాయించారు. నల్గొండ కార్పొరేషన్‌లో 48 వార్డులుండగా ఎస్‌టిలకు 1, ఎస్‌సిలకు 9, 20 బిసిలకు కేటాయించారు. మహబూబ్‌నగర్‌లో 60 వార్డులుండగా ఎస్‌టిలకు 1, ఎస్‌సిలకు 3, 26 బిసిలకు కేటాయించారు. సామాజిక వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్లను మళ్లీ ప్రత్యేకంగా కొన్నింటిని మహిళలకు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల సంఖ్య ఖరారు చేసింది. వీటిలో జనరల్ 3౦, జనరల్ మహిళ 31, ఎస్‌టి జనరల్ 3, ఎస్‌టి మహిళ 2, ఎస్‌సి జనరల్ 9, ఎస్‌సి మహిళ 8, బిసి జనరల్ 19, బిసి మహిళ 19 స్థానాలను కేటాయించారు. మున్సిపాలిటీల వారీగా ఏ వార్డు ఎవరికి అన్నదానిపై ఈ నెల 17న రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత రిజర్వేషన్లు
50 శాతం మించకుండా ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు పెంచే అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పాత రిజర్వేషన్ల శాతం మించకుండానే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఖరారు చేయడం గమనార్హం.