Reading Time: < 1 minute

పుష్ప సినిమా సక్సెస్ తర్వాత ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆయన ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఆయన ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కోలీవుడ్ దర్శకుడితో కలిసి బన్నీ పని చేయనున్నారు. ఆ దర్శకుడే లోకేశ్ కనకరాజ్.

లోకేశ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రానుంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది. దీంతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో 23వ సినిమా కావడంతో ‘ఎఎ23’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉండనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.