
తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.మంగళకరమైన ఈ సంక్రాంతి పండుగ శుభవేళ మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన బుధవారం తెలిపారు. సూర్యుడి గమనంలో వచ్చే మార్పు కొత్త వెలుగులకు ఎలా నాంది పలుకుతుందో, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కూడా సరికొత్త ఆశయాలను ఉన్నతమైన లక్షాలను నింపాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ పండుగ మన దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, రకరకాల సంప్రదాయాలతో జరుపుకున్నా, మనందరిని కలిపి ఉంచే ఆత్మీయత, మనం పంచుకునే ఆనందం మాత్రం ఒక్కటేనని, మన భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని ఏకత్వ స్పూర్తిని ఈ సంబరాలు చాటి చెబుతాయని ఆయన పేర్కొన్నారు.