Reading Time: < 1 minute

హైదరాబాద్: ఓ కథనానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురు ఎన్టివి జర్నలిస్టులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అక్రమ అరెస్టులను బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఖండించారు. ఈ అరెస్టులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలన ప్రతిసారీ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని.. జర్నలిస్టులను నేరస్థులుగా చూడటం దురదృష్టకరమని కెటిఆర్ అన్నారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కదా? అర్థరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి అతిగా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.