Reading Time: < 1 minute

తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో పండగ రోజున రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. తుళ్లూరుకు చెందిన బుద్ధ మార్క్, బురడ సాంబయ్యలు నూతన బైపాస్ మీదుగా విజయవాడ వెళ్తుండగా.. అటు వైపు నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. రాంగ్ రూట్‌లో వచ్చి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.