Reading Time: < 1 minute

టీం ఇండియా ఆటగాడు యుజవేంద్ర చాహల్ గతేడాది తన మాజీ భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో పెళ్లి చేసుకున్న వీరిద్దరు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. అప్పటి నుంచి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. అయితే వీరిద్దరి గురించి సోషల్‌మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మళ్లీ వీళ్లిద్దరూ కలవబోతున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి.

అయితే అది మళ్లీ కలిసి జీవించడానికి కాదు.. ఓ రియాలిటీ షో కోసమట. చాహల్-ధన శ్రీలు ‘ది 50’ అనే రియాలిటీ షోలో కలిసి పాల్గొంటున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై చాహల్ తాజాగా స్పందించాడు.

తామిద్దరు కలుస్తామనన్న వార్తలను చాహల్ కొట్టిపారేశాడు. తమపై వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని తేల్చి చెప్పాడు. ఈ విషయాన్ని చాహల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం ఊహాజనితం, తప్పుడు సమాచారం అని పేర్కొన్నాడు. అయితే ఈ రూమర్స్‌పై ధనశ్రీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ‘ది 50’ అనే రియాలిటీ షో ఫిబ్రవరి 1న ప్రత్యేక్ష ప్రసారం కానుంది. ఈ షోకు ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.