
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో నిషేధిత సిపిఐ (మావోయిస్టు) ఫ్రంటల్ సంస్థలకు చెందిన 29 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇది దర్భా డివిజన్‌లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ. బుధవారం సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ ముందు ఆయుధాలతో సహా మావోలు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో గోగుండలోని దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంగతాన్ (DAKMS) అధిపతి పోడియం బుధ్రా, డిఎకెఎంఎస్, మిలీషియా, జనతన సర్కార్ విభాగాల సభ్యులతో పాటు ఉన్నారు.
భద్రత, సమాజంలో తిరిగి విలీనం అందించే పునరావాస వాగ్దానాలతో వారు సీనియర్ పోలీసు, సిఆర్‌పిఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు. కాగా, గతకొలంగా స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు మావోలే లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది మావోలను ఎన్ కౌంటర్ భద్రతా దళాలు హతమర్చాయి. ఈ క్రమంలో మావోలు గుంపులు గుంపులు పోలీసు అధికారుల ముందు లొంగిపోతున్నారు.