Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన దాన్ని అరికట్టలేకపోతోంది. అయితే ఢిల్లీని వేధిస్తున్న ఈ వాయు కాలుష్య సమస్య ఇప్పుడు బ్యాడ్మింటన్‌ను కూడా తాకింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రపంచ నెంబర్ 3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించాడు. ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో అతనిపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల జరిమానా విధించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడే ఆగస్టులో బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పోటీలను టెస్ట్ ఈవెంట్‌గా ప్రకటించారు.