Reading Time: < 1 minute

రాజ్‌కోట్: భారత స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితాలో మళ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత కోహ్లీ నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటంతో ఆస్ట్రేలియా సిరీస్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరిది కావచ్చని వార్తలు వచ్చాయి. కానీ కోహ్లీ గేర్ మార్చి వరుస సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌లో వరుసగా ఐదు 50+ స్కోర్లు సాధించాడు. దీంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక, రోహిత్ మూడో స్థానానికి పడిపోయాడు. బ్యాటర్ రేటింగ్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడం కోహ్లీకి ఇది 11వ సారి.

కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో కోహ్లీ 93 పరుగులతో రాణించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ బ్యాటర్ల జాబితాలో నంబర్ 2 నుండి నెంబర్ 1కి చేర్చింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక, భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఐదో స్థానంలో నిలిచాడు.