
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకి దర్శకురాలు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో ఓ ఇంటిమెట్ సీన్ ఉండటంతో దానిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. టీజర్‌ని తొలగించాలని డిమాండ్‌లు వినిపించాయి. అయితే ఈ సీన్‌లో నటించిన నటి కోసం నెటిజన్లు తెగ వెతికారు. అయితే ఆమె పేరు బీట్రీజ్ టోఫెన్ బాఖ్ అని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ వెల్లడించారు. దీంతో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్లు పెరిగిపోయారు. కానీ, ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఖాతా కనిపించడం లేదు.
బీట్రీజ్ బాఖ్ హాలీవుడ్‌లో మంచి గుర్తింపు కలిగిన నటి. హాలీవుడ్ టివి సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్‌తో ఆమె ఫేమస్ అయింది. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్ నటించింది. టాక్సిక్ ఆమెకు తొలి ఇండియన్ చిత్రం. ఆమె వివరాలు తెలియగా.. ఆమెను ఫోలవర్ల సంఖ్య పెరిగిపోయింది. జనవరి 13వ తేదీ వరకూ ఆమె ఖాతా యాక్టివ్‌గానే ఉంది. కానీ, సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో బీట్రీజ్ ఖాతా కనిపించడం లేదు. మరి దీని ఆమె ఎందుకు ఖాతా డిలీట్ చేసిందో ఆమెకే తెలియాలి.