Reading Time: < 1 minute

రాజ్‌కోట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిరంజన్ షా స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ని సమం చేయాలని న్యూజిలాండ్ ఆశపడుతోంది. ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ జట్టులోకి జేడెన్ లెన్నాక్స్ ఆరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా జట్టులో ఒక మార్పు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీశ్ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్.