Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపి రవిశంకర్ ప్రసాద్ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని 21, మదర్ థెరిసా క్రెసెంట్ రోడ్డులో ఉన్న  రవిశంకర్ నివాసంలో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఇంటిలోని ఒక గదిలో ఉన్న మంచంపై మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ సంభవించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు.. ఢిల్లీ పోలీసుల ఫోరెన్సిక్ బృందాన్ని ఎంపి నివాసానికి పంపారు. అ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.