Reading Time: < 1 minute

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్.. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం(జనవరి 14) భోగి పండుగ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సంతోషంగా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ ప్రతి కుటుంబానికి చేరాలనేదే మా సంకల్పమని సిఎం రేవంత్ తెలిపారు. ఇక, మాజీ సిఎం కెసిఆర్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సంక్రాంతి శోభతో రాష్ట్రమంతా సంతోషాలు వెల్లివిరియాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతుల సంక్షేమం తిరిగి గాడిన పడాలని కెసిఆర్ పేర్కొన్నారు.