Reading Time: < 1 minute

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ ను హోంగార్డును ఓ బైకర్ ఢీకొట్టి పరాయ్యాడు. ఈ ఘటనలో హోంగార్డు గాయపడ్డాడు. మంగళవారం రాత్రి బహదూర్‌పురాలో ఈ హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. గాయపడిన హోంగార్డును 40 ఏళ్ల జంగయ్యగా గుర్తించారు. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న జంగయ్య, బహదూర్‌పురా రోడ్డుపై చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయడానికి బారికేడ్లు పెడుతుండగా.., వేగంగా వచ్చిన ఒక బైకర్ అతడిని ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన హోంగార్డును చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా బైకర్‌ను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.