Reading Time: < 1 minute

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. సంక్రాంతి పండగ సెలబ్రేషన్స్ సందర్భంగా తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. వెంకన్నను దర్శించుకునేందుకు బుధవారం మోస్తరు సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. మంగళవారం స్వామివారిని 73,014 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 19,639 మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.