Reading Time: 2 minutes

భారత్‌పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి

అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు

అన్ని విషయాలు చెబితే యావత్ ప్రపంచ మీడియాలో

సంచలనం రేగుతుంది

వెలుగులోకి జైషే మహ్మద్

ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ఆడియో రికార్డింగ్

న్యూఢిల్లీ: భారతదేశంపై ఏ క్షణమైనా ఆ త్మాహుతి దాడికి పెద్దసంఖ్యలో సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని టెర్రరిస్ట్ సంస్థ జైష్ -ఎ- మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్ పేర్కొన్నట్లు చెబుతున్న ఆడియో రి కార్డింగ్ బయటపడింది. పాకిస్తాన్ గడ్డ నుంచి భారతదేశంపై దాడులకు కుట్రపన్నాడని చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాదిగా పేర్కొంది. ఆ రికార్డింగ్‌లో వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు విరుచుకుపడేందుకు సిద్ధం గా ఉన్నారని, భారతదేశంలో చొరబడేందు కు అనుమతినివ్వాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని అజర్ పేర్కొన్నట్లు వినబడుతున్నది. తన బృందంలో ఫైటర్స్ సంఖ్య వెల్లడిస్తే, ప్రపంచం దిగ్భ్రమ చెందడం ఖాయం అని అతడు పేర్కొన్నాడు. అతడి మాటల్లోనే “యే (ఆత్మాహుతి బాంబ

ర్లు) ఏక్ నహీ, దో నహీ, సౌ నహీ, హజార్ భీ నహీ.. అగర్ పూరి తాడత్ బతా దూన్, తో కల్ దునియా కీ మీడియా పర్ హంగామా మచ్ జాయేగా…” (ఈ ఆత్మాహుతి బాంబర్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కూడా కాదు. నేను మీకు మొత్తం ఎంతమందో సంఖ్య చెబుతే, రేపు ప్రపంచ మీడియాలో సంచలనం రేగుతుంది) అని విన్పించింది. లక్ష్య సాధనలో అవసరమైనే చనిపోయే విధంగా వారిని రెచ్చగొట్టినట్లు కూడా అతడు పేర్కొన్నాడు. అయితే ఈ ఆడియో ఎప్పుడు ఏ తేదీన రికార్డింగ్ జరిగింది. ఎంతవరకూ నిజం అని ఎవరూ ధ్రువీకరించలేదు. అజార్ చాలా కాలంగా భారతదేశంపై రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.

2001 పార్లమెంటు పై దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక టెర్రరిస్ట్ దాడుల వెనుక అతడే కీలక సూత్రధారి అనే అరోపణలు ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారతసైనిక దళాలు బహవల్పూర్ లోని జైష్ -ఎ -మొహమ్మద్ ప్రధాన కార్యాలయం తోసహా పాక్ లోని జైషే లక్ష్యాలపై దాడులు చేసిన నెలల తర్వాత మసూద్ అజార్ నుంచి తాజా హెచ్చరిక వచ్చింది. ఆదాడులలో దాదాపు 10 మంది అజార్ కుటుంబ సభ్యులు మరణించారు. 2019 నుంచి మసూద్ అజార్ బహిరంగంగా కన్పించడం లేదు. బహవల్పూర్ లోని అతడి స్థావరంపై గుర్తు తెలియని దుండగులు శక్తివంతమైన బాంబులతో దాడి చేశారు. దానినుంచి అజార్ ప్రాణాలతో బయటపడినా, ప్రజలకు దూరంగా ఉంటున్నాడు.