Reading Time: < 1 minute

 అశోక్ నగర్ చౌరస్తాలో రాత్రివేళ ఆందోళన

భారీగా మోహరించిన పోలీసులు

ఉద్యోగాలు కావాలంటూ నినాదాలు   

మన తెలంగాణ/విద్యానగర్: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అశోక్ నగర్ చౌరస్తా కు పెద్ద సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటూ నినదించారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. నిరుద్యోగుల ధర్నాతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నిరుద్యోగుల కంటే ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పినప్పటికీ పలితం లేకపోయింది. దీంతో రోడ్లపై బైఠాయించిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. ఈ సమయంలో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. వసతి గృహాల నుంచి ఒకరివెనుక మరొకరు రావడంతో అశోక్ నగర్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది.