Reading Time: < 1 minute

నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైసా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ల తర్వాత, తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వణుకు పుట్టించే ఈ టీజర్, మైసా పాత్ర డార్క్ అండ్ ఇంటెన్స్ చూపించింది. కథానాయిక తల్లి గొంతుతో వచ్చే ‘నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్ మొదలైంది. ఈ పాత్ర కోసం రష్మిక మందన్న చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది.

ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత రా అండ్ వయోలెంట్ క్యారెక్టర్. రక్తం మరకలతో నిండిన రఫ్ లుక్‌లో మైసా పాత్రలో రష్మిక ఫైర్ లా కనిపించింది. టీజర్ చివరలో ఆమె చేసే గర్జన, మైసా పాత్రలో దాగున్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని అద్భుతంగా చూపించింది. రవీంద్ర పుల్లే ఈ కథను ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. కథనం ఎక్కడా రాజీ పడకుండా, పూర్తిగా ఇంటెన్స్‌గా సాగుతుందని టీజర్ స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా గోండ్ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా రష్మిక పాత్రను చూపించిన విధానం ఇండియన్ సినిమాల్లో అరుదైన ప్రయత్నంగా నిలుస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరుగుతున్న మైసా యాక్షన్ ప్రధానంగా రూపొందుతోంది.