Reading Time: < 1 minute
Rishab Shetty 80 Crore Remuneration Jai Hanuman Producers Unhappy

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ‘కాంతార’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు తెలుగులో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిషబ్ శెట్టి ఈ ఏడాది తన పూర్తి సమయాన్ని కేవలం ఈ రెండు ప్రాజెక్టులకే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇతర ఏ కొత్త సినిమాలకు ఆయన డేట్స్ ఇవ్వడం లేదు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి ఈ సినిమాల కోసం ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read : Karthi ‘హిట్-4’పై కీలక అప్‌డేట్..!

సాధారణంగా హీరోలు లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిలో పనిచేయాలని నిర్మాతలు కోరుతుంటారు. కానీ, రిషబ్ శెట్టి మాత్రం ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ మొత్తం విన్న టాలీవుడ్ నిర్మాతలు ఒక్కసారిగా విస్తుపోయారు. దీంతో జాతీయ అవార్డు గ్రహీతగా ఆయనకు ఉన్న క్రేజ్, ‘కాంతార’తో సాధించిన మార్కెట్ దృష్ట్యా ఈ స్థాయి రెమ్యునరేషన్ అడగడం సమంజసమే అని కొందరు అంటుంటే, నిర్మాతలు మాత్రం బడ్జెట్ భారం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పారితోషికం విషయంలో రిషబ్ తగ్గకపోవడంతో, నిర్మాతలు ఆయన అడిగినంత ఇవ్వడానికి మొగ్గు చూపుతారా లేదా లాభాల్లో వాటా పద్ధతికే ఒప్పిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు రిషబ్ శెట్టి వంటి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్‌తో పని చేయడానికి సిద్ధమవుతున్న వేళ, ఈ ఆర్థికపరమైన చర్చలు ఎక్కడ ముగుస్తాయో వేచి చూడాలి