నారింజ తొక్క – ఉప్పు కాంబినేషన్: నారింజ తొక్కలు అద్భుతమైన సువాసనను ఇస్తాయి, ఉప్పు తేమను పీల్చుకుంటుంది. ఒక చిన్న గిన్నెలో తాజా నారింజ తొక్కను ఉంచి, దానిపై అర టీస్పూన్ ఉప్పు చల్లండి. దీన్ని ఫ్రిజ్ మూలలో పెడితే కేవలం 10 నిమిషాల్లో దుర్వాసన మాయమై మంచి సువాసన వస్తుంది.
వార్తాపత్రిక – వెనిగర్ చిట్కా: మీ ఇంట్లో నారింజ తొక్కలు లేకపోతే పాత న్యూస్ పేపర్, వెనిగర్‌తో పని పూర్తి చేయవచ్చు. వెనిగర్ బ్యాక్టీరియాను చంపడమే కాకుండా వాసనను పీల్చుకుంటుంది. వార్తాపత్రికను ఉండలా చుట్టి, దానిపై కొంచెం వెనిగర్, నీళ్లు చల్లి తడి చేయండి. ఈ ఉండలను ఫ్రిజ్ అరల్లో ఉంచితే, బూజు వాసనను ఇది త్వరగా లాగేస్తుంది.
కాఫీ పొడి లేదా బొగ్గు ముక్క: ఫ్రిజ్‌లో ఘాటైన వాసనలు ఉన్నప్పుడు కాఫీ పొడి, బొగ్గు బాగా పనిచేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని ఒక ప్లేటులో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. కాఫీలో ఉండే నైట్రోజన్ దుర్వాసనను తొలగిస్తుంది. ఒక చిన్న బొగ్గు ముక్కను పల్చని గుడ్డలో కట్టి ఫ్రిజ్‌లో ఉంచినా ఫలితం అద్భుతంగా ఉంటుంది.
బేకింగ్ సోడా: చాలా మంది నిపుణులు సూచించే మరో సులభమైన మార్గం బేకింగ్ సోడా. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌లో ఉంచితే, అది గాలిలోని ఆమ్లత్వ ప్రవృత్తి గల వాసనలను పూర్తిగా తటస్థీకరిస్తుంది.
ఫ్రిజ్‌లో వస్తువులను మూత లేకుండా పెట్టకండి. వారానికి ఒకసారి కుళ్లిపోయిన కూరగాయలు లేదా పాత ఆహార పదార్థాలను తొలగించండి. ఫ్రిజ్ లోపల రబ్బరు గాస్కెట్లను తడి గుడ్డతో తుడుస్తూ ఉండండి, అక్కడ బూజు చేరే అవకాశం ఎక్కువ. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఫ్రిజ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకోండి.




