Reading Time: < 1 minute
Revanth Reddy Challenges Pinarayi Vijayan Visit Telangana To See Six Guarantees In Action

కేరళం సీఎం పినరయ్ విజయన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ‘ఆరు గ్యారెంటీలు’ ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తున్నాయో వివరించారు. రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల లోన్లు మాఫీ చేసినట్లు సీఎం తెలిపారు. అలాగే రైతు భరోసా కింద రూ.18 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేసి రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించామని సీఎం రేవంత్ చెప్పారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Also Read: LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!

సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా రాష్ట్రంకి వచ్చి మా సిక్స్ గ్యారెంటీలు ఎలా అలవుతున్నాయో చూడండి. రైతుల లోన్ వేవ్ చేశాము. రైతు భరోసా కింద 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. 67173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. కేరళంలో పినరయ్ విజయన్‌కి సమయం అయిపోయుంది. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి.. కేరళంలో పినరయ్ విజయన్‌కి పెద్ద తేడా లేదు. పదేళ్లలో అటు తెలంగాణను కేసీఆర్.. ఇటు కేరళంను పినరయ్ విజయన్ భ్రస్టు పట్టించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తోంది. ఈ నెలలో కేరళంలో కూడా మరో పదేళ్ల పాటు యూడీఎఫ్‌ గవర్నమెంట్ నడిచేలా ప్రభుత్వం వస్తుంది’ అని అన్నారు.