
రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ రాష్ట్ర ముఖ్య్మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు త్యాగం, ధైర్యంను సిఎం గుర్తు చేసుకున్నారు. ఏసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమతత్వం బోధించిన దయామయుడు, సిలువపై ఏసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సిఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.