Reading Time: < 1 minute
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

బిజీ కొత్తూరులో ఓ రైతు పొలాన్ని సాగుకు సిద్ధం చేస్తూ జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ పురాతన మట్టి కుండ బయటపడింది. ఆ కుండలో సుమారు 70 పురాతన నాణేలు ఉండటాన్ని గమనించిన అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు, గుట్టుచప్పుడు కాకుండా వాటిని చేజిక్కించుకున్నారు. అయితే, ఈ ‘గుప్తనిధి’ పంపకాల్లో వారి మధ్య విభేదాలు వచ్చాయి. అవికాస్తా చిలికి చిలికి గాలివానలా మారి చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఒక వ్యక్తి నుంచి రెండు నాణేలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇవి రాగితో చేసిన నాణేలని, 14వ శతాబ్దానికి చెందిన బహమనీ సుల్తానుల కాలం నాటివని గుర్తించారు. పురాతన చరిత్రకు సంబంధించిన ఈ విలువైన నాణేలు బయటపడటం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నాణేలను పురావస్తు శాఖకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం :

డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌

పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం!

వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్

వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్