Reading Time: < 1 minute
రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు

మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తోంది. “ఇంకా దగ్గరికి వచ్చేయండి, మేం మీకోసమే ఎదురుచూస్తున్నాం” అంటూ అమెరికా సైన్యాన్ని సవాలు చేస్తూ ఇరాన్‌ ఓ వీడియోలో కవ్వించింది. తమ గడ్డమీద అడుగుపెట్టే అమెరికా సైనికులను నరికి పర్షియన్ గల్ఫ్‌లోని చేపలకు విందుచేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ప్రెస్ టీవీ విడుదల చేసిన 59 సెకన్ల వీడియోలో… ఇరాన్ స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు ట్రైనింగ్‌ తీసుకుంటున్న దృశ్యాలున్నాయి. ఇరాన్‌లో కొన్ని వారాల పాటు పరిమిత స్థాయి గ్రౌండ్ ఆపరేషన్లు చేపట్టాలని అమెరికా నిర్ణయించింది. ఇందుకోసం అదనపు బలగాలను ఈ ప్రాంతానికి తరలిస్తోంది పెంటగాన్. భారీ యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి లో సుమారు 3,500 మంది మెరైన్లు, సైనికులు ఇరాన్ వైపుగా పయనిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌

పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం!

వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్

వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్