Reading Time: < 1 minute
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

ఈ అద్భుత మార్పుకు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేసిన ఒక చిన్న ప్రయత్నం కారణమైంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే శాశ్వత మార్పు వస్తుందని భావించిన ఆయన.. సర్పంచులు, యువత, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ప్రధానంగా.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. గ్రామాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి. గ్రామాల్లోకి గంజాయి రాకుండా కట్టుదిట్టం చేయాలి అనే మూడు సూత్రాలపై ఆయన అవగాహన కల్పించారు.ఎస్పీ పిలుపుతో స్పందించిన బయ్యారం మండలంలోని వెంకటాపురం, బాలాజీపేట వంటి గ్రామాలు ఏకంగా గ్రామసభలు పెట్టి కఠిన నిబంధనలు విధించుకున్నాయి. గ్రామ పొలిమేరల్లో “హెల్మెట్ లేకుండా గ్రామంలోకి ప్రవేశం లేదు” అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. యువత స్వచ్ఛందంగా రోడ్లపై నిలబడి హెల్మెట్ లేని వాహనదారులను అడ్డుకుంటున్నారు. కేవలం రహదారి భద్రతే కాకుండా, గ్రామస్తులంతా కలిసి స్వయం శక్తితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా ఒక ఉద్యమంలా సాగుతోంది. ఈ విధానం రాష్ట్రమంతటా అమలు కాగలిగితే ప్రమాదాలు తగ్గడమే కాకుండా, నేరాలు కూడా పూర్తిగా అదుపులోకి వస్తాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌

పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం!

వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్

వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్