
ఇరాన్ ను మట్టుబెడతాం.. రాతి యుగంలోకి నెట్టేస్తాం.. అంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇరాన్. తమ వీపు తమకు కనబడదు అన్నట్లుగా అమెరికా ధోరణి ఉందంటూ ఇరాన్ మిలిటరీ కమాండ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ల సైనుకులను రాతి సమాధుల్లోకి పంపిస్తున్నదే అమెరికా అని.. ఆ విషయం మరిచిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 250 ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికా.. 6 వేల ఏళ్ల చరిత్ర ఉన్న దేశాన్ని భయపెట్టడం హాస్యాస్పదం అని విమర్శించారు.
ఇరాన్ IRGC బ్రిగేడర్ జనరల్ సయీద్ మూసావీ మాట్లాడుతూ.. సైనికులను సమాధుల్లోకి, రాతి యుగంలోకి నెట్టేసుకుంటున్న అమెరికా ఇతరులపై మాట్లాడటం విడ్డూరమన్నారు. యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ పీట్ హెగ్సేత్ కు రిప్లై ఇస్తూ .. మీరు ఇంకా హాలీవుడ్ భ్రమలోనే ఉందని.. ఆ భ్రమ వీ మెదళ్లను విషతుల్యం చేసిందని విమర్శించారు.
ఇరాన్ ఇక రాతి యుగంలోకే అంటూ హెగ్ సేత్ చేసిన పోస్ట్ ను ట్రంప్ కూడా మెన్షన్ చేస్తూ.. ఇరాన్ బ్లాస్ట్ అయిపోతుంది.. బ్యాక్ టు ద స్టోన్ ఏజెస్ అంటూ పోస్ట్ చేశారు. ఇరాన్ కొత్త ప్రభుత్వ అధ్యక్షుడు అంతకు ముందు వారి కంటే తక్కువ తీవ్రవాద ధోరణి కలిగినవాడు.. తెలివైన వాడు.. అమెరికాను కాల్పుల విరమణ కోరారు. హార్ముజ్ జలసంధి తెరిచి, స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రమే మేము సీజ్ ఫైర్ గురించి ఆలోచిస్తాము. అప్పటి వరకు, ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాము లేదా, వారు చెప్పుకునే విధంగానే, రాతి యుగానికి నెట్టివేస్తాం.. అంటూ ట్రంప్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి రిప్లైగా ఇరాన్ కమాండర్ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం పశ్చిమాసియాలో అనిశ్చితి ఇప్పటిలో తొలగిపోయేలా లేదని స్పష్టమవుతోంది.
మిడిల్ ఈస్ట్ లో అమెరికా-ఇజ్రాయెల్ 2026 ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ పై యుద్ధం ప్రారంభించాయి. ఇప్పటికి 5వ వారానికి యుద్ధం చేరుకున్నా.. ముగిసే పరిస్థితులు మాత్రం కనిపించడంలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అమెరికా దాడిలో చనిపోవడంతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. అమెరికా సైనిక స్థావరాల ఏర్పాటుకు సహకారం అందించిన మిగతా గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. దీనికి తోడు హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.