Reading Time: < 1 minute

నోరూరించే మసాలా ఇడ్లీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.. బ్రేక్‌ఫాస్ట్ అదిరిపోద్ది..

Caption of Image.

రోజూ తినే ఇడ్లీ బోర్ కొడుతోందా ? మిగిలిపోయిన ఇడ్లీలతో ఏం చేయాలో అర్థం కావట్లేదా ? అయితే కేవలం పది నిమిషాల్లో తయారయ్యే ఈ  మసాలా ఇడ్లీ ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు!

కావలసిన పదార్థాలు
ఇడ్లీలు: 8, 
పచ్చిమిర్చి: రెండు (మధ్యకు తరిగి), 
అల్లం : చిన్న ముక్క (తురుము) 
ఉల్లిపాయ: ఒకటి (సన్నగా తరిగి) 
టొమాటో: ఒకటి (సన్నగా తరిగి) 
కొత్తిమీర తరుగు: కొంచెం, 
పసుపు: పావు టేబుల్ స్పూన్, 
కారం: అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి: పావు టేబుల్ స్పూన్ 
సోంపు గింజల పొడి : అర టేబుల్ స్పూన్ 
గరం మసాలా: చిటికెడు,
నిమ్మరసం: అర టేబుల్ స్పూన్, 
ఆవాలు : ఒక టేబుల్ స్పూన్, 
నూనె: ఒక టేబుల్ స్పూన్, 
కరివేపాకు రెండు రెమ్మలు 
ఆయిల్: ఒక టేబుల్ స్పూన్,
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ
స్టవ్ వెలిగించి పాన్లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేగించాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం తురుము వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేగించాలి. ఈ మిశ్రమంలోనే పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు గింజల పొడి, గరం మసాలా వేగించాలి. చివరగా టొమాటో ముక్కలు వేయాలి. ఇవి వేగాక ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలుపుకుంటే వేడి వేడి మసాలా ఇడ్లీ రెడీ, గ్రీన్ చట్నీతో వీటిని తినొచ్చు.
 

©️ VIL Media Pvt Ltd.