Reading Time: < 1 minute

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెకెఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు ఓటమిపాలయ్యాయి. ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్‌సిబి చేతిలో ఓడిపోగా.. కెకెఆర్‌ని.. ముంబై ఇండియన్స్ జట్టు ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో గెలుపు ఖాతా తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతుండగా.. ఎస్‌ఆర్‌హెచ్ ఒక మార్పు చేసింది. శివాంగ్‌ని జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు:

కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, బ్లెస్సింగ్ ముజర్బాని.

ఎస్ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, డేవిడ్ పైన్.