Reading Time: < 1 minute

ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

Caption of Image.

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.  ఈ  బిల్లుకు లోక్‌సభ ఏప్రిల్ 1న  ఆమోదం తెలపగా..ఇవాళ  రాజ్యసభ ఆమోదం తెలిపింది.  కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లను రాజ్యసభలో ప్రవేశ పెట్టాగా.. సుధీర్ఘ చర్చ అనంతరం బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.  దీంతో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్  ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

వైసీపీ వాకౌట్

ఈ బిల్లులో అనేక అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. అమరావతిని వైసీపీ ఏనాడు వ్యతిరేకించలేదని చెప్పారు.  రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.  మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవుతుందంటున్నారు.. కేవలం రెండేళ్లలోనే 3 లక్షల 40 వేల కోట్ల అప్పు చేశారని  తెలిపారు. ఇదే పాలన కొనసాగిస్తే ఏపీ అప్పు 14లక్షల కోట్లకు చేరుతుందని విమర్శించారు.  అనంతరం అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్‌  చేసింది. 

©️ VIL Media Pvt Ltd.