Reading Time: < 1 minute

పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (ఐప్యాక్) కార్యాల యాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో ఇడి అధి కారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్ వ్యవస్థాపకులు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ శర్మ, వినీష్ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఇడి అధికారులు సోదాలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థ ఇడి ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయాలపై దాడి చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో, సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిలో సోదాలు నిర్వహించా రు. ఐప్యాక్ వంటి వృత్తిపరమైన సంస్థకు ఇది ఒక కష్టమైన, దురదృష్టకరమైన రోజు అని ఈ దాడిపై ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా వుంటే, ఐపాక్ (ఐప్యాక్) సంస్థ, బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బిఆర్‌ఎస్), జనతా దళ్ (యునైటెడ్), శివసేన వంటి అనేక రాజకీయ పార్టీలకు వృత్తిపరమైన, సిద్ధాంతపరమైన సలహాదారుగా పని చేసింది. ఐప్యాక్‌పై ఇడి దాడులు రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడులలో జోక్యం చేసుకున్నారని, పోలీసుల సహాయంతో డిజిటల్ పరికరాలు, ముఖ్యమైన పత్రాలను తొలగించి, ఏమీ స్వాధీనం చేసుకోకుం డానే సోదాలను నిలిపివేయమని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆరోపించింది. తాజాగా బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సుమారు రూ. 20 కోట్ల హవా లా నిధులను ఐప్యాక్‌కు పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డేటాను తారుమా రు చేయకుండా రక్షణ కల్పించ డం, తమ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ నుండి ఉపశమనం కల్పించడంతో సహా పలు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది.