
మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడంటే ఎంతటి భక్తియో అందరికీ తెలిసిందే. తన విజయాల వెనుక ఆ వాయుపుత్రుడి ఆశీస్సులు ఉన్నాయని ఆయన నమ్ముతారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా తన ఇంట్లోని పూజా మందిరంలో జరిగే ఒక అద్భుతాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్య కిరణాలు సప్తవర్ణాలుగా మారి, తన ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని పాదాల నుండి శిరస్సు వరకు స్పృశిస్తూ సాగడం ఒక వింత అని చిరు పేర్కొన్నారు.
Also Read : Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!
ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించిన ‘సూర్య తిలకం’ దృశ్యాన్ని గుర్తు చేస్తూ.. తన ఇంట్లో కూడా అలాంటి దైవానుభూతి కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు అరసవిల్లి, కోణార్క్ వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగే ఈ అద్భుతం తన ఇంట్లోనూ జరగడం విశేషమని ఆయన వీడియోలో వివరించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు, భక్తులందరికీ ఆయన హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. అయితే ఉత్తరాది సంప్రదాయం ప్రకారం చైత్ర పూర్ణిమ నాడు (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. చిరంజీవి ఈ విశేషమైన రోజునే తన ఇలవేల్పుకు సంబంధించిన ఈ వీడియోను షేర్ చేసి అందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.
![]()
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్
జై హనుమాన్
#HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026
జై హనుమాన్